ICC Cricket World Cup 2019 : Team India Orange Jersey Officially Unveiled By BCCI || Oneindia Telugu

2019-06-29 1

ICC Cricket World Cup 2019:MS Dhoni, Virat Kohli and other members of the Indian cricket team posed for the first time in their away jersey ahead of the India vs England World Cup 2019 clash on Sunday.
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#viratkohli
#rohitsharma
#msdhoni
#shikhardhawan
#cricket
#teamindia

ప్రపంచకప్‌లో ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగే పోరులో భారత జట్టు ధరించే ‘అవే’ జెర్సీని శుక్రవారం బీసీసీఐ విడుదల చేసింది. ముందు భాగంలో ముదురు నీలం రంగు... భుజాలు, వెనక భాగం పూర్తిగా నారింజ రంగుతో కనిపించేలా ఈ జెర్సీని ‘నైకీ’ సంస్థ డిజైన్‌ చేసింది. కొన్నాళ్ల క్రితం భారత్‌ ఉపయోగించిన ప్రాక్టీస్‌ డ్రెస్‌ పోలికలు ఇందులో కనిపిస్తున్నాయి. రేపు ఎడ్జ్‌బాస్టన్‌ మైదానంలో ఆతిథ్య ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్‌ కొత్త జెర్సీతో బరిలోకి దిగుతుంది. ఫుట్‌బాల్‌ తరహాలో హోం, అవే మ్యాచ్‌లకు వేర్వేరు జెర్సీలను వేసుకునే సంప్రదాయాన్ని ఐసీసీ తొలిసారిగా ఈ ప్రపంచ కప్‌లో ప్రవేశపెట్టింది. భారత్, ఇంగ్లండ్‌ రెండు జట్లూ నీలి రంగునే వాడుతుండటంతో వాటి మధ్య తేడా చూపించేందుకు టీమిండియా ఆటగాళ్లు నారింజ రంగు జెర్సీని వేసుకోబోతున్నారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ‘హోమ్‌’ టీమ్‌ కాగా, భారత్‌ను ‘అవే’ జట్టుగా నిర్ధారించారు.